Skip to main content

టీజీయూజీసెట్-2021 ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది మార్చి 5..

2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌‌స సొసైటీలు..
టీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల్లో, టీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ మెన్ అండ్ విమెన్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ గురుకుల యూజీ కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్(టీజీయూజీసెట్)-2021కు అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

గ్రూపులు: బీఏ/బీబీఏ/బీకాం/ బీఎస్సీ డిగ్రీ ఇంగ్లిష్ మీడియం కోర్సులు.
సీట్ల సంఖ్య: ప్రతి గ్రూపునకు 40 మంది విద్యార్థులను తీసుకుంటారు.
అర్హత: మార్చి 2020లో జరిగిన ఇంటర్మీడియట్/తత్సమాన/ఒకేషనల్ కోర్సుల్లో కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2021 మేలో జరిగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000, పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.

ఎంపిక విధానం: టీజీయూజీసెట్-2021 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది సిలబస్ ఆధారంగా పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు ఆప్షనల్ సబ్జెక్టులు, జనరల్ ఇంగ్లిష్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.03.2021
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 15.04.2021
ప్రవేశ పరీక్ష తేది: 25.04.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tswreis.in , http://tgtwgurukulam.telangana.gov.in/

Photo Stories