Skip to main content

మహాత్మా జ్యోతిబాపూలే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌–2021.. దరఖాస్తుకు చివరి తేది మే 31..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ–ఆర్‌డీసీ సెట్‌–2021..

కోర్సులు: ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి ఏడాది.

ఇంటర్మీడియట్‌(ఇంగ్లిష్‌ మీడియం):
మొత్తం కళాశాలలు: 134 (బాలురు– 66, బాలికలు–68)
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు.

అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల విద్యార్థులు అర్హులు.

మహిళా డిగ్రీ కళాశాల–1(ఇంగ్లిష్‌ మీడియం):
కోర్సులు: బీఎస్సీ, ఎంపీసీ; బీఎస్సీ ఎంఎస్‌సీఎస్‌; బీఎస్సీ ఎంపీసీఎస్‌; బీఎస్సీ బీజడ్‌సీ; బీఎస్సీ బీబీసీ; బీఎస్సీ డేటాసైన్స్‌; బీఏ హెచ్‌ఈపీ; బీఏ హెచ్‌ఈపీ; బీకాం(జనరల్‌); బీకాం(కంప్యూటర్స్‌); బీకాం(బిజినెస్‌ అనలైటిక్స్‌).
అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ: 04.06.2021
ప్రవేశ పరీక్ష తేది: 13.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://mjptbcwreis.telangana.gov.in/

Photo Stories