Skip to main content

జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీజీ, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో 2021 ప్రవేశాలు

బెంగళూరులోని భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) పోస్టు గ్రాడ్యుయేట్, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
  • రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు పీహెచ్‌డీ/ ఎంఎస్‌ (ఇంజనీరింగ్‌/ ఎంఎస్‌ (రీసెర్చ్‌):
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌/జస్ట్‌ స్కోర్‌/ సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.
    ఎంపిక విధానం: జాతీయ అర్హత పరీక్షల్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

  • మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎమ్మెస్సీ కెమిస్ట్రీ):
    అర్హత: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా ఏదైనా గ్రూపుతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జాయింట్‌ అడ్మిషన్స్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) అర్హత ఉండాలి.
    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో ఎంపికైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. జామ్‌ పరీక్షలో అర్హత పొందిన వారు రాతపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వారిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

  • ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు:
    విభాగాలు: మెటీరియల్‌ సైన్స్, కెమికల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్స్‌.
    అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జామ్‌ 2021 రాత పరీక్షలో అర్హత సాధించాలి.
    ఎంపిక విధానం: జామ్‌/జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 19, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.jncasr.ac.in/admission/degree-programmes

Photo Stories