Skip to main content

ఎన్‌బీఈ–డీఎన్‌బీ పీడీసెట్‌ 2021.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 14..

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ).. 2021 విద్యా సంవత్సరానికి డీఎన్‌బీ–పీడీసెట్‌కు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా పోస్టు డిప్లొమా డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డీఎన్‌బీ–పోస్టు డిప్లొమా సెంట్రలైజ్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీడీసెట్‌):
అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా(పీజీ డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. పీజీ డిప్లొమా చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. సంబంధిత స్పెషలైజేషన్‌ నుంచి 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత వేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 14.04.2021
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 03.05.2021
పరీక్ష తేది: 09.05.2021
ఫలితాల వెల్లడి తేది: 31.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nbe.edu.in, https://natboard.edu.in/

Photo Stories