Skip to main content

ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌–2021 ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ.. ఏపీలోని 10 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌–2021 ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ (ఏపీఆర్‌జేసీ) 2021–22:
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉండాలి.

ఎంపిక విధానం: లాటరీ పద్థతి ద్వారా ఎంపిక చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ (ఏపీఆర్‌డీసీ) 2021–22:
అర్హత:
2021లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. వివిధ కోర్సులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్‌ మెరిట్‌/లక్కీ డ్రా ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in

Photo Stories