Skip to main content

CPGET 2023 Notification: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాల­యాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) సంప్రదాయ పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
cpget 2023 notification

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐబీఎస్సీ, బీఎల్‌ఐబీఎస్సీ.
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సు విభాగాలు: బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ /ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, అప్లైడ్‌ ఎకనామిక్స్, ఐఎంబీఏ.
పీజీ డిప్లొమా కోర్సులు-విభాగాలు: చైల్డ్‌ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేజ్‌ కౌన్సెలింగ్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌.
అర్హత: పీజీ,పీజీడీ కోర్సులకు కనీసం 40శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎడ్, ఐపీజీ కోర్సులకు కనీసం 50శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Admission in NFSU Gandhinagar: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష,రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష: సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు తేదీలు: మే 12 నుంచి జూన్‌ 11
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: జూన్‌ 12-18
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: జూన్‌19-20

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు: జూన్‌ చివరి వారం నుంచి 

వెబ్‌సైట్‌: https://cpget.tsche.ac.in/

Last Date

Photo Stories