Mahatma Jyotibapule AP RJC-CET-2022 : మహాత్మా జ్యోతిబాపూలే ఏపీఆర్‌జేసీ సెట్–2022
మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటి ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఆర్‌జేసీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also read: FADEE 2022 Notification: ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ
మొత్తం కళాశాలలు: 14
ఇంటర్ గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.
అర్హత: ఏప్రిల్–2022లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.
వయసు: 31.08.2022 నాటికి 17ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
Also read: CUET PG 2022 Notification: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.06.2022
ప్రవేశ పరీక్ష తేది: 26.06.2022
వెబ్‌సైట్:https://apgpcet.apcfss.in