Skip to main content

AP EAPCET BiPC Stream Admission 2023: ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ, బీటెక్‌ ప్రవేశాలు

ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ANGRAU B.Tech and B.Sc. Admission 2023

ఇంటర్‌లో బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులు: బీఎస్సీ(హానర్స్‌) వ్యవసాయం, బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులకు ఈఏపీసెట్‌-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎన్నారై కోటాలో బీఎస్సీ(హానర్స్‌)వ్యవసాయం, కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులు బీటెక్‌(వ్యవసాయ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ)ల్లో రైతు కోటాలో ప్రవేశాలకు ఈఏపీసెట్‌-2023లో ర్యాంకులు సాధించిన వారు అర్హులు.

మొత్తం సీట్ల సంఖ్య: 1117
కోర్సులు-సీట్ల సంఖ్య: బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌-1062, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ)-55.
అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజికల్‌ సైన్సెస్, బయలాజికల్‌ లేదా నేచురల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు ఏపీ ఈఏపీసెట్‌-2023 ర్యాంకు సా«ధించి ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: Admissions in ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌-2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 27.07.2023.

వెబ్‌సైట్‌: https://ugadmissionsangrau.aptonline.in/

Last Date

Photo Stories