Skip to main content

Admissions in JNTUH: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తేదీలు

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూహెచ్‌)–ఫుల్‌టైమ్‌ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్‌ కోర్సుల్లో స్పాన్సర్డ్‌ కేటగిరీ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్‌ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
JNTUH Pharmacy Regular Courses,Admissions in JNTUH,Full-Time M.Tech Courses,JNTUH Hyderabad Campus M.Tech Admission

మొత్తం సీట్ల సంఖ్య: 228
విభాగాలు: ఈఈఈ, మెకానికల్, ఎనర్జీ సిస్ట­మ్స్, బయో టెక్నాలజీ, కెమికల్, మెటలర్జికల్, సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్, ఇన్విరాన్‌మెంట్, స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, వాటర్‌ రిసోర్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు అకడమిక్‌ సంస్థలు/పరిశ్రమలు/రీసెర్చ్‌ యూనిట్లలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గేట్‌/జీప్యాట్‌/టీఎస్‌ పీజీఈసెట్‌–2023లో అర్హత సాధించి ఉండాలి.

చదవండి: Admissions in NIMS Hyderabad: నిమ్స్‌ హైదరాబాద్‌లో ఎంపీటీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం: విద్యార్హత, గేట్‌/జీప్యాట్‌/టీఎస్‌ పీజీఈసెట్‌–2023 ర్యాంకు ఆధారంగా ఎంపికచేస్తారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తేదీలు: 04.10.2023, 05.10.2023, 06.10.2023.

వెబ్‌సైట్‌: https://www.jntuh.ac.in/

Last Date

Photo Stories