M.Tech Admission 2023: నిట్ సిల్చార్‌లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
అసోం రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), సిల్చార్ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: ఎంటెక్ ప్రోగ్రామ్–స్పాన్సర్డ్/సెల్ఫ్ స్పాన్సర్డ్ కేటగిరీ(ఫుల్ టైం అండ్ పార్ట్ టైం)/ప్రాజెక్ట్ స్టాఫ్/ఇన్‌స్టిట్యూట్ ఎంప్లాయ్(పార్ట్ టైం).
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ /టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.
- షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి: 16.08.2023.
- రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది: 22.08.2023.
- అడ్మిషన్ తేది: 23.08.2023.
- తరగతుల ప్రారంభతేది: 23.08.2023.
- వెబ్‌సైట్: http://www.nits.ac.in/
చదవండి: Free Civils Prelims Coaching: మనూలో ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Last Date