Admission in BITS Pilani: బిట్స్, పిలానీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
2022–2023 విద్యాసంవత్సరానికి సంబంధించి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిర్లా).. పిలానీ, దుబాయ్, గోవా, హైదరాబాద్ ప్రాంగణాల్లో ఎంఈ, ఎంఫార్మా, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ఎంఈ కోర్సులు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిజైన్ ఇంజనీరింగ్, ఎంబడెడ్ సిస్టమ్స్, మాన్యూఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంఫార్మా కోర్సులు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: గేట్/జీప్యాట్ స్కోర్/బిట్స్ హెచ్‌డీ అడ్మిషన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:29.05.2022
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలు:2022 జూలై 2,3.
వెబ్‌సైట్: https://www.bitsadmission.com/
చదవండి: TS EDCET 2022 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..