JNTUH: డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ), స్వీడన్ (యూరప్)లోని బ్లెకింగె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బీటీహెచ్)తో కలిసి 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ
ప్రోగ్రామ్(ఐడీడీఎంపీ)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ఐడీడీఎంపీ(ఈసీఈ)–20 సీట్లు:
బీటెక్(ఈసీఈ) అండ్ ఎంటెక్(టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్) జేఎన్‌టీ యూహెచ్‌లో, ఎమ్మెస్సీ(టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్) బీటీహెచ్, స్వీడన్‌లో అందిస్తారు.
ఐడీడీఎంపీ(సీఎస్‌ఈ)–40 సీట్లు:
బీటెక్(సీఎస్‌ఈ)–ఎంటెక్(సీఎస్‌ఈ) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ(సీఎస్‌ఈ) బీటీహెచ్, స్వీడన్‌లో అందిస్తారు(20 సీట్లు).
బీటెక్(సీఎస్‌ఈ)–ఎంటెక్(సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ(సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) బీటీహెచ్, స్వీడన్‌లో అందిస్తారు(20 సీట్లు).
ఐడీడీఎంపీ (మెకానికల్ ఇంజనీరింగ్)– 15 సీట్లు:
బీటెక్(మెకానికల్) అండ్ ఎంటెక్(మెకానికల్) జేఎన్‌టీయూహెచ్‌లో, ఎమ్మెస్సీ(మెకానికల్) బీటీహెచ్, స్వీడన్‌లో అందిస్తారు.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అభ్యర్థులకు 16ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: టీఎస్ ఎంసెట్/జేఈఈ(మెయిన్స్)–2021 ర్యాంక్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021
వెబ్‌సైట్: http://jntuh.ac.in/
చదవండి: ACSIR 2022: ఏసీఎస్‌ఐఆర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల