Skip to main content

DOST Notification 2023: దోస్త్‌ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో.. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్‌).. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. దోస్త్‌ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.
DOST Notification 2023

కోర్సుల వివరాలు
రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల  సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో బీబీఏ డేటా అనలిటిక్స్‌ కోర్సులోని 60 సీట్లకు కూడా దాని ద్వారానే ప్రవేశం కల్పిస్తారు.  
ఈసారి బీఎస్సీ ఆనర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పేరిట నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రారంభించనున్నారు.

TS DEECET 2023 Notification: రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..
 
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొదటి విడత రిజిస్ట్రేషన్‌ : మే 16 నుంచి జూన్‌ 10 వరకు; వెబ్‌ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్‌ 11 వరకు; సీట్ల కేటాయింపు: జూన్‌ 16న; సీట్లు పొందినవారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూన్‌ 16 నుంచి 25 వరకు.
రెండో విడత రిజిస్ట్రేషన్‌: జూన్‌16 నుంచి 26 వరకు; వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 16 నుంచి 27 వరకు; సీట్ల కేటాయింపు: జూన్‌ 30న; సీట్లు పొందిన వారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 1 నుంచి 5 వరకు.
మూడో విడత రిజిస్ట్రేషన్‌: జూలై 1 నుంచి 5 వరకు; వెబ్‌ ఆప్షన్లు: జూలై 1 నుంచి 6 వరకు; సీట్ల కేటాయింపు: జూలై 10న; సీట్లు పొందినవారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూలై 10 నుంచి 14 వరకు.
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌(మూడు విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినవారికి)–జూలై 10 నుంచి 15 వరకు.

తరగతుల ప్రారంభ తేది: జూలై 17న.

వెబ్‌సైట్‌: https://dost.cgg.gov.in/

Last Date

Photo Stories