UPSC NDA&NA Notification 2023: 395 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 395. నేషనల్ డిఫెన్స్ అకాడమీ-370(ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120)ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నావల్ అకాడమి(10+2క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)ఖాళీలు 25 ఉన్నాయి.
కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమి అండ్ నావల్ అకాడమీ(ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నావల్ అకాడమి) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌ఏ(10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.
దరఖాస్తులకు చివరి తేది: 10.01.2023.
ఆన్‌లైన్ రాతపరీక్ష: 16.04.2023
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
వెబ్‌సైట్: https://upsconline.nic.in/
చదవండి: UPSC CDS 1 2023 Notification: 341 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |