Skip to main content

TSNPDCL Notification 2023: టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో 100 కొలువులు.. రాత పరీక్ష, సిలబస్‌ ఇదే..

వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెగ్యులర్‌ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నారు. ఆ వివరాలు..
tsnpdcl exam pattern and syllabus

ఈ సర్కిళ్లలోనే పోస్టుల భర్తీ
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్‌ విద్యుత్‌ సర్కిళ్లలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు: బీఏ/బీఎస్సీ/బీకామ్‌తోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌/ఆఫీస్‌ ఆటోమేషన్‌(ఎంఎస్‌ ఆఫీస్‌) సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ«ధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇప్పటికే టీఎస్‌ ట్రాన్స్‌కో /టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పనిచేస్తున్న ఉద్యోగులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి విషయంలో ఉద్యోగంలో చేరినప్పటి వయసును పరిగణనలోకి తీసుకుంటారు. వీరు నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: TSNPDCL Recruitment 2023: టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో 100 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

ఎంపిక ఇలా: రాత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష ఇలా: ఓఎంఆర్‌షీట్‌ పద్ధతిలో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. దీంట్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, సెక్షన్‌-బిలో కంప్యూటర్‌ అవేర్‌నెస్‌కు చెందిన 20 ప్రశ్నలు-20 మార్కులు, సెక్షన్‌-సిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు-20 మార్కులుంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మా«ధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.

కనీస మార్కులు: బీసీలకు 35శాతం,ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు 30% రావాలి. రాత పరీక్షను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ,వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: APCPDCL Recruitment 2023: పరీక్ష లేకుండానే ఏపీసీపీడీసీఎల్, విజయవాడలో 100 ఖాళీలు .. ఎవరు అర్హులంటే..

సిలబస్‌ అంశాలు
సెక్షన్‌-ఎ: న్యూమరికల్‌ ఎబిలిటీలోని.. ఇండిసెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఉంటాయి. ఇవేకాకుండా లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సెక్షన్‌-బి: కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో.. ఎంఎస్‌-ఆఫీస్, బేసిక్‌ కాన్సెప్ట్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ , కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ స్కిల్స్, అకౌంట్స్‌ రిలేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ అంశాలు ఉంటాయి.
సెక్షన్‌-సి: ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ, కాంప్రహెన్షన్‌ పాసేజెస్‌ అండ్‌ రీ అరెంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, సిననిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్‌ ఉంటాయి.
జనరల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగానికి సంబంధించి కరెంట్‌ అఫైర్స్, కన్సూమర్‌ రిలేషన్స్, జనరల్‌ సైన్స్‌ ఇన్‌ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మెయిటేజీ ఇలా: ప్రశ్నపత్రం 80 మార్కులకు, ఇన్‌ సర్వీస్‌ వెయిటేజీ మార్కులు 20 ఉంటాయి. ఉద్యోగ ప్రకటన జారీ నాటికి టీఎస్‌ ట్రాన్స్‌కో/టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్నవారికి వెయిటేజీ మార్కులు ఉంటాయి. ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున ఇస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీస్‌ ఉన్నవారికి వెయిటేజీ మార్కుల నిబంధన వర్తించదు. వివిధ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు ప్రభు­త్వ నిబంధనల ప్రకారం-రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం, బీసీలకు-25 శాతం,ఎస్సీలకు 15శాతం,ఎస్టీలకు 10శాతం, పీ­హెచ్‌లకు 4శాతం, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 2 శాతం, మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ప్రొబేషన్‌: ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల కాలానికి ట్రైనింగ్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఉంటుంది. విధుల్లో చేరే సమయంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, క్యాస్ట్‌ అండ్‌ స్టడీ/రెసిడెన్స్‌ ఒరిజనల్‌ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరే సమయంలో ఐదేళ్లకు(ప్రొబేషన్‌కు అదనంగా) బాండ్‌ రాయాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29.04.2023
  • దరఖాస్తు సవరణ తేదీలు: 2023. మే 02 -05 తేదీ వరకు
  • వెబ్‌సైట్‌: https://tsnpdcl.cgg.gov.in/

చ‌ద‌వండి: 3055 Nursing Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories