DMHO: ప్రకాశంలో 127 పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్వో).. ఒప్పంద/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 127
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–21, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ–68, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్–38.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/
తత్సమాన, డిప్లొమా(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
Qualification | 10TH |
Last Date | December 05,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |