Skip to main content

SSC Officer Posts: ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ 2022 జూన్‌(ఏటీ 22) కోర్సు ద్వారా.. వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Indian Navy

పోస్టులు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు.  
మొత్తం పోస్టుల సంఖ్య: 181 
బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌–90,ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌–18,టెక్నికల్‌ బ్రాంచ్‌–73

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 
విభాగాలు: జనరల్‌ సర్వీస్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్‌. 
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

ఎడ్యుకేషనల్‌ బ్రాంచ్‌(ఎడ్యుకేషన్‌): 
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 02.07.1997 నుంచి 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి.

టెక్నికల్‌ బ్రాంచ్‌: 
విభాగాలు: ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌), ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌), నావల్‌ ఆర్కిటెక్ట్‌. 
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 02.07.1997 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు,మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 21.09.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Qualification GRADUATE
Last Date October 05,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories