Skip to main content

9212 Jobs in CRPF: పదితోనే కానిస్టేబుల్‌ కొలువు.. నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ... విజయానికి ప్రిపరేషన్‌ ఇలా‌..

చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవచ్చు. పదో తరగతి అర్హతతో.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో కానిస్టేబుల్‌గా కొలువు సొంతం చేసుకునే అవకాశం స్వాగతం పలుకుతోంది. తాజాగా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) మొత్తం 9,212 కానిస్టేబుల్‌(టెక్నికల్, ట్రేడ్స్‌మెన్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
9212 jobs in crpf notification details
  • 9,212 కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • పదో తరగతి, ఐటీఐ అర్హతతో పోటీ పడే అవకాశం
  • నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా టెక్నికల్‌/ట్రేడ్స్‌మెన్‌ విభాగాల్లో మొత్తం 9,212 కానిస్టేబుల్‌ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు మహిళలు కూడా పోటీ పడే అవకాశం కల్పించింది. మొత్తం పోస్ట్‌లలో 105 పోస్ట్‌లను మహిళలకు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్ట్‌ల సంఖ్యను ప్రకటించినప్పటికీ..అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ కేంద్రాల్లో నియామకాలు ఖరారు చేస్తారు.

టెక్నికల్‌ విభాగాలివే

  • కానిస్టేబుల్‌ టెక్నికల్‌/ట్రేడ్స్‌మెన్‌ పేరిట నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో పురుష అభ్యర్థులకు 15 విభాగాల్లో.. మహిళా అభ్యర్థులకు ఏడు విభాగాల్లో అవకాశాలు కల్పించనున్నారు. 
  • పురుష అభ్యర్థులు: డ్రైవర్, మోటార్‌ మెకానిక్‌ వెహికిల్,కోబ్లర్, టైలర్, బ్రాస్‌ బ్యాండ్, పైప్‌ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాట­ర్‌ క్యారియర్, వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి.
  • మహిళా అభ్యర్థులు: బగ్లర్, కుక్, వాటర్‌ క్యారియర్, వాషర్‌ ఉమెన్, హెయిర్‌ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్‌ బ్యాండ్‌.

అర్హత

  • ఆగస్ట్‌ 1, 2023 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
  • డ్రైవర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు మాత్రం హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగుండాలి.
  • మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ పోస్ట్‌లకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ బ్రాంచ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. (లేదా) కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌ ట్రేడ్‌లో మూడేళ్ల వ్యవధి గల అప్రెంటీస్‌షిప్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. అదే విధంగా ఒక ఏడాది అనుభవం తప్పనిసరి.
  • వయసు: కానిస్టేబుల్‌(డ్రైవర్‌) ఆగస్ట్‌1, 2023 నాటికి 21-27ఏళ్లు ఉండాలి. మిగితా పోస్టులకు 18-23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అ­యిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పు­న గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 
  • వేతన శ్రేణి: రూ.21,700- రూ.69,100 ఉండాలి. 

నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌(టెక్నికల్‌/ట్రేడ్స్‌మెన్‌) పోస్ట్‌ల భర్తీకి మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అవి.. కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష; ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌; ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌; ట్రేడ్‌ టెస్ట్‌.

చదవండి: TS పోలీస్ గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

రాత పరీక్ష..100 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌; జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్‌; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌; ఇంగ్లిష్‌/హిందీ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. 

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల మేరకు మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి. పురుషులు 170 సెం.మీ ఎత్తు, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. పురుషుల ఛాతి విస్తీర్ణం 80 సెం.మీ.ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ విస్తరించాలి.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌

  • ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌లో నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగున్న వారికి మూడో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆయా ట్రే­డ్స్, విభాగాలకు పరుగు పందెం నిర్వహిస్తారు.
  • డ్రైవర్, మోటార్‌ మెకానిక్‌ వెహికిల్, గార్డెనర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్‌ బ్యాండ్, పైప్‌ బ్యాండ్, కోబ్లర్, టైలర్, బగ్లర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు అయిదు కిలో మీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో (మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8 నిమిషాల 30 సెకండ్లలో) చేరుకోవాలి.
  • కుక్, వాటర్‌ క్యారియర్, బార్బర్, హెయిర్‌ డ్రెస్స­ర్,వాషర్‌ మ్యాన్,వాషర్‌ ఉమెన్, సఫాయి కర్మచా­రి పోస్ట్‌ల అభ్యర్థులు 1.6కిలో మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 12 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.

చివరగా ట్రేడ్‌ టెస్ట్‌

  • మూడు దశల్లోనూ విజయం సాధించిన వారికి చివరగా..50మార్కులకు ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తా­రు. ఈ ట్రేడ్‌ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో ప్రాక్టికల్‌గా తమ నైపుణ్యాలను చూపాల్సి ఉంటుంది. ట్రేడ్‌ టెస్ట్‌లో అభ్యర్థులు తప్పనిసరిగా 20 మార్కులు పొందాల్సి ఉంటుంది. వారినే చివరగా నిర్వహించే మెడికల్‌ టెస్ట్, డా­క్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు అర్హులుగా ప్రకటిస్తారు.
  • అన్ని టెస్ట్‌లలోనూ విజయం సాధించిన వారికి చివరగా.. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ పేరుతో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెడికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెడికల్‌ టెస్ట్‌లోనూ విజయం సాధించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సొంతం చేసుకుంటే.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ (టెక్నికల్‌/ట్రేడ్స్‌మెన్‌) కొలువు ఖరారవుతుంది.

చదవండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

రాత పరీక్షలో విజయానికి ఇలా

మొత్తం నాలుగు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో.. తొలి దశ రాత పరీక్షలో విజయం సాధించడమే ఎంతో కీలకం. ఎందుకంటే.. ఈ రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగానే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. 

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్,సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్,అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌ - డీకోడింగ్‌ నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌

అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఇంగ్లిష్‌/హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లిష్‌నే ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

అనుసంధానం

అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా ఇతర పరీక్షల ప్రిపరేషన్‌తో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరీక్ష ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్‌ నియామక పరీక్షలు, అదే విధంగా ఇటీవల స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసిన ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఆ పరీక్షల ప్రిపరేషన్‌నే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామినేషన్‌కు కూడా ఉపయుక్తంగా ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా..ఒకే సమయంలో పలు పరీక్షలకు పోటీ పడే సన్నద్ధత పొందొచ్చు. సిలబస్‌లోని అంశాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ జారీ: జూన్‌ 20 - జూన్‌ 25, 2023
  • రాత పరీక్ష తేదీ: జూలై 1 నుంచి జూలై 13 వరకు 
  • వెబ్‌సైట్‌: https://crpf.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories