DAE-BARC Recruitment: డీఏఈ-బార్క్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సైన్స్ పోస్టు గ్రాడ్యుయేట్స్‌కి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రెయినింగ్ స్కూల్స్ ద్వారా శిక్షణ ఇచ్చి సైంటిఫిక్ ఆఫీసర్లుగా ఎంపికచేస్తారు.
విభాగాలు
ఓసీఈఎస్2022(స్కీమ్1): ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది; స్టైపెండ్: రూ.55,000 వరకు చెల్లిస్తారు. ట్రెయినింగ్ సమయంలో వన్‌టైం బుక్ అలÐð న్స్ కింద రూ.18,000 అందజేస్తారు.
డీజీఎఫ్‌ఎస్2022(స్కీమ్2): స్టైపెండ్: రూ.55,000 వరకు చెల్లిస్తారు. దీనికి వన్ టైం బుక్ అలవెన్స్ కింద రూ.18,000, కంటిజెన్సీ గ్రాంట్ కింద రూ.25,000 అందజేస్తారు.
అర్హతలు
ఇంజనీరింగ్ విభాగం అభ్యర్థులు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత ఉండాలి.
సైన్స్ విభాగం అభ్యర్థులు: బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లైడ్ ఫిజిక్స్/బయోసైన్సెస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత ఉండాలి.
వయసు: 01.08.2022 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
శిక్షణ ఇచ్చే బార్క్ ట్రెయినింగ్ స్కూల్స్: బార్క్ముంబై, ఐజీసీఏఆర్కల్పక్కం, ఆర్ఆర్సీఏటీఇండోర్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్హైదరాబాద్, ఏఎండీఈఆర్హైదరాబాద్.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, గేట్ 2021/గేట్ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికఉంటుంది.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీలు: 2022 ఏప్రిల్ 07 నుంచి 13 వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.02.2022
దరఖాస్తుల సమర్పణకు చివరి తేది:12.02.2022
వెబ్‌సైట్: http://www.barconlineexam.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |