Skip to main content

CWC Recruitment 2023: సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 153 కొలువులు.. రాత పరీక్ష ఇలా‌..

ప్రభుత్వ మినీరత్న సంస్థ..సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ 153 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ, బీఎస్సీ, బీకాం, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
153 Vacant Positions.,Eligibility Criteria,Central Warehousing Corporation has released a notification for filling up 153 posts

మొత్తం పోస్టుల సంఖ్య: 153
అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)-18, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-05, అకౌంటెంట్‌-24, సూపరిండెంట్‌(జనరల్‌)-11, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-81, సూపరిండెంట్‌(జనరల్‌)-ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-2, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ -ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-10, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎస్‌ఆర్‌డీ(లద్దాఖ్‌  యూటీ)-2 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు

  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌): ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): ఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ /బీటెక్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అకౌంటెంట్‌: బీకాం/బీఏ(కామర్స్‌) లేదా చార్టర్‌ అకౌంటెంట్‌గా మూడేళ్ల పని అనుభవం ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
  • సూపరిండెంట్‌(జనరల్‌): ఏదైన విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: అగ్రికల్చర్‌/జూవాలజీ/కెమిస్ట్రీ/బయో-కెమిస్ట్రీ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అన్ని పోస్టులకూ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ను అదనపు అర్హతగా పరిగణì స్తారు.

చదవండి: HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 37 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

వయసు
 24.09.2023 నాటికి జేటీఏ పోస్టులకు 28 ఏళ్లలోపు ఉండాలి. మిగతా ఉద్యోగాలకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు  ఉంటుంది.

వేతనాలు
అసిస్టెంట్‌ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరిండెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.40,000- రూ.1,40,000(ఈ-1) వేతనంగా లభిస్తుంది. అ లాగే జూనియర్‌ అసిస్టెంట్‌ ఎంపికైన వారు రూ. 29,000-రూ.93,000 వేతనంగా పొందవచ్చు.

చదవండి: SJVN Limited Recruitment 2023: 155 ఫీల్డ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..

రాత పరీక్ష

  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)/(ఎలక్ట్రికల్‌): ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 145 ప్రశ్నలకు-200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 6 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌  భాషల్లో ఉంటుంది.
  • అకౌంటెంట్‌: ఆన్‌లైన్‌ పరీక్షలో 200 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలకు-20 మార్కులకు ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 65 ప్రశ్నలకు-65 మార్కులు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
  • సూపరిండెంట్‌(జనరల్‌): ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో రెండున్నర గంటల వ్యవధిలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు-200 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు-50 మార్కులు. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు-50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది.
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో రెండున్నర గంటల వ్యవధిలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు-200 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు-40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలకు-40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 -ప్రశ్నలు 20 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

చదవండి: Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2023
  • వెబ్‌సైట్‌: https://www.cewacor.nic.in/
Qualification GRADUATE
Last Date September 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories