Finance Ministry Recruitment: ఆర్థిక మంత్రిత్వ శాఖలో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. అర్హతలు ఇవే..
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్(డీజీపీఎం).. స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: టాక్స్ అసిస్టెంట్–10, స్టెనోగ్రాఫర్ గ్రేడ్2–01, హవల్దార్–10, ఎంటీఎస్–03.
క్రీడలు: క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నైపుణ్యాలతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. క్రీడార్హతల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయి, సీనియర్/జూనియర్ స్థాయి
ఛాంపియన్‌షిప్, ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం/పతకాలు గెలిచి ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి 18–27ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:క్రీడల్లో సాధించిన విజయాలు, విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి ఫీల్డ్ ట్రయల్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి పేర్కొన్న పోస్టుల ఆధారంగా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, హవల్దార్ పోస్టులకు ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడిషనల్ డైరెక్టర్(క్యాడర్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పెరఫార్మన్స్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, రూమ్ నెం.510, ఐదో ఫ్లోర్, డ్రమ్ షేప్
బిల్డింగ్, ఐపీ భవన్, ఐపీ ఎస్టేట్, న్యూఢిల్లీ–110002 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021
వెబ్‌సైట్: https://dgpm.gov.in/
చదవండి: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో 300 సెయిలర్ పోస్టులు..
Qualification | 10TH |
Last Date | November 05,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |