ALIMCO Recruitment: అలిమ్‌కోలో ప్రోస్థటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, ఆడియాలజిస్ట్ పోస్టులు
కాన్పూర్‌లోని మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్(అలిమ్‌కో).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ప్రోస్థటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్–13, ఆడియాలజిస్ట్–10.
ప్రోస్థటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్:
అర్హత: ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు.
వేతనం మొదటి సంవత్సరం నెలకు రూ.25,000, ఆ తర్వాత నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ఆడియాలజిస్ట్:
అర్హత: ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనిలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, ఆ తర్వాత నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
వెబ్‌సైట్: https://www.alimco.in/
చదవండి: Postal Department: పోస్టల్ సర్కిల్, ఢిల్లీలో 221 పోస్టులు..
Qualification | POST GRADUATE |
Last Date | November 03,2021 |
Experience | 1 year |
For more details, | Click here |