NIN Recruitment: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.32 వేల వేతనం
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్)..ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(కమ్యూనికేషన్):
అర్హత: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.32,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్:
అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021
వెబ్‌సైట్: https://www.nin.res.in
చదవండి: NEERI Recruitment: నీరీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Qualification | 12TH |
Last Date | November 08,2021 |
Experience | 2 year |
For more details, | Click here |