Skip to main content

HPCL Recruitment: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

HPCL Bangalore

ముంబైలో ఉన్న మహారత్న సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)... బెంగళూరులోని హెచ్‌పీ గ్రీన్‌ ఆర్‌–డీ సెంటర్‌లో నిర్ణీత కాలవ్యవధి ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు: కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ/బయోసైన్సెస్‌/బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 11.10.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021 

వెబ్‌సైట్‌: http://www.hindustanpetroleum.com//

చ‌ద‌వండి: Faculty Posts: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో ఫ్యాకల్టీ పోస్టులు..

Qualification GRADUATE
Last Date October 31,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories