ISP Nashik Recruitment 2023: ఐటీఐతోనే కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య 108:
పోస్టుల వివరాలు: వెల్ఫేర్ ఆఫీసర్-01, జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్)-41, కంట్రోల్-41, స్టూడియో-04, స్టోర్-04, సీఎస్‌డీ-05, టర్నర్-01, మెషినిస్ట్ గ్రైండర్-01, వెల్డర్-01, ఫిట్టర్-04, ఎలక్ట్రీషియన్-02, ఎలక్ట్రానిక్స్-03.
విభాగాలు: టెక్నికల్ స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్.
అర్హతలు
వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణులై మరాఠీ భాష తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ /పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/పర్సనల్ ఆఫీసర్/హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
జూనియర్ టెక్నీషియన్: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికేట్/ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి.
వయసు
వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు 31.07.2023 నాటికి 18-30 ఏళ్ల మ«ధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు 31.07.2023 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్లను అనుసరించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనాలు: వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.29,740 నుంచి రూ.1,03,000 వరకు వేతనంగా లభిస్తుంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.18,780 నుంచి రూ.67,390 వరకు వేతనంగా పొందవచ్చు.
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2023
వెబ్‌సైట్: https://ispnasik.spmcil.com/
చదవండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | July 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |