Skip to main content

12,828 India Post Jobs: పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఉద్యోగాల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే–2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు.
India Post GDS Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12,828(తెలంగాణ–96, ఆంధ్రప్రదేశ్‌–118)
పోస్టుల వివరాలు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌–బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా చదివుండాలి. అదేవిధంగా కంప్యూటర్‌ పరిజ్ఞానంతోపాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 11.06.2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. 
వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380, ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.06.2023.
  • దరఖాస్తు సవరణలకు అవకాశం: 12.06.2023 నుంచి 14.06.2023 వరకు.
  • వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/

చ‌ద‌వండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories