Skip to main content

IGNOU Recruitment 2023: ఇగ్నోలో 102 ఉద్యోగాలు.. ఎంపిక, సిలబస్‌ ఇలా..

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో).. తాజాగా 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Selection through Computer Based Test   IGNOU Recruitment 2023 Notification Apply Online by 21st December

మొత్తం పోస్టుల సంఖ్య: 102
జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (జేఏటీ)-50
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు/హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయగలగాలి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 21.12.2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టెనోగ్రాఫర్‌ పోస్టులు-52
అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా 10+2 తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు /హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయగలగాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 
వయసు: 21.12.2023 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు,  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు వారికి మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

వేతనాలు
జూనియర్‌ అసిస్టెంట్‌-కమ్‌ టైపిస్ట్‌(జేఏటీ) పోస్టులకు ఎంపికైన వారికి లెవల్‌-2 ప్రకారం-ప్రతి నెల రూ.19,900-63,200 వరకు వేతనం అందుతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఎంపికైన వారికి లెవల్‌-4 ప్రకారం-ప్రతి నెల రూ.25,500-రూ.81,100 వేతనంగా లభిస్తుంది.

ఎంపిక ఇలా
అభ్యర్థుల ఎంపికకు రెండు దశల్లో అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. అవి..టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు. 

 • టైర్‌-1: (జేఏటీ, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు): ఇందులో 5సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌-1లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌-30 మార్కులు,సెక్షన్‌-2లో రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌-30 మా­ర్కులు,సెక్షన్‌-3లో హిందీ/ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌-30 మార్కులు, సెక్షన్‌-4లో జనరల్‌ అవేర్‌నెస్‌-30 మార్కులు,సెక్షన్‌-5 లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌-30 మార్కులుంటాయి. 
 • టైర్‌-2: ఈ పరీక్ష రెండు పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది.

సిలబస్‌ ఇలా

 • మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌: నంబర్‌ సిస్టమ్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, టిగ్రనోమెట్రీ, స్టాటిస్టిక్స్‌-ప్రాబబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 • రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌: వెర్బల్‌-నాన్‌ వెర్బల్, వెన్‌డయాగ్రమ్స్, నంబర్‌ సిరీస్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎమోషనల్, సోషల్‌ ఇంటెలిజెన్సీ, వర్డ్‌ బిల్డింగ్, కోడింగ్‌-డీకోడింగ్, న్యూమరికల్‌ ఆపరేషన్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్‌ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, స్పాట్‌ ద ఎర్రర్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్‌ మిస్‌ స్పెల్డ్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్, పాసివ్‌ వాయిస్‌ ఆఫ్‌ వెర్బ్స్, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 • జనరల్‌ అవేర్‌నెస్‌: సమాజ పరిస్థితులపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే ఇండియన్‌ హిస్టరీ, కల్చర్, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులను గురించి ప్రశ్నలను అడుగుతారు.
 • కంప్యూటర్‌ నాలెడ్జ్‌: కంప్యూటర్‌ బేసిక్స్, వర్కింగ్‌ విత్‌ ఇంటర్నెట్‌ అండ్‌ ఈ-మెయిల్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ముఖ్యసమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.12.2023
 • దరఖాస్తు ఎడిట్‌ ఆప్షన్‌: 2023 డిసెంబర్‌ 22-25 తేదీల వరకు
 • వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date December 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories