Skip to main content

Midhani Hyderabad Recruitment: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

Midhani Hyderabad

హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–02, మేనేజర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–04, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–01.

అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. 
వేతనం: ఏడాదికి రూ.09 నుంచి 31.60 లక్షల వరకు చెల్లిస్తారు.

మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 
వయసు: 40ఏళ్లు మించకూడదు. 
వేతనం ఏడాదికి రూ.13.50 నుంచి 40.70 లక్షల వరకు చెల్లిస్తారు.

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 
వయసు: 45ఏళ్లు మించకూడదు. 
వేతనం: ఏడాదికి రూ.18.0లక్షల నుంచి 49.70 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా వస్తే రాతపరీక్ష కూడా నిర్వహించవచ్చు. రాత పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021

వెబ్‌సైట్‌: https://midhani-india.in/

చ‌ద‌వండి: MECON Limited Recruitment: మెకాన్‌ లిమిటెడ్, రాంచీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification GRADUATE
Last Date November 24,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories