Apprentice Posts: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 355 పోస్టులు.. అర్హతలు ఇవే..
కొచ్చిలోని మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 355
ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు–347, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–08.
ట్రేడ్ అప్రెంటిస్‌లు:
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
టెక్నీషియన్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బేసిక్ నర్సింగ్ అండ్ పల్లియేటివ్ కేర్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్.
అర్హత: ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్(వీహెచ్‌ఎస్‌ఈ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
వెబ్‌సైట్: https://cochinshipyard.in/
చదవండి: MIDHANI Recruitment: మిథానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | November 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |