TS Government Jobs : తెలంగాణలో 1147 పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ.. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,147
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబ యాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్తీషి యా, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.
వయసు: 01.07.2022 నాటికి 44ఏళ్లు మించకూడదు. టీఎస్‌ఆర్‌టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు నిర్ధారిస్తారు. మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.01.2023.
వెబ్‌సైట్ : mhsrb.telangana.gov.in
Qualification | POST GRADUATE |
Last Date | January 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |