Tata Technologies: మహిళలకు గుడ్ న్యూస్... టాటాలో భారీగా ఉద్యోగాలు... పూర్తి వివరాలు ఇవే...

అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే క్రమంలో ’రెయిన్‌బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.
చదవండి: 7 లక్షల ప్యాకేజీతో టాటా స్టీల్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్–వింగ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
చదవండి: పదో తరగతి అర్హతతో 12,828 India Post Jobs... పూర్తి వివరాలు ఇవే

టాటా టెక్నాలజీస్ బిజినెస్ అనుకున్నదానికంటే అధికంగా వృద్ధి చెందడంతో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి 12 నెలల వ్యవధిలో 3,000 మందిని నియమించుకోవాలని భావించింది. ఇందులో భాగంగా 2023 ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,000 మందిని నియమించుకోవాలని భావిస్తోంది.
☛➤☛ ఇంటర్ అర్హతతో ఎస్ఎస్‌సీలో 1600 ఉద్యోగాలు... పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్