Fertilizer Subsidy: ఎరువులపై రైతులకు రూ.24,420 కోట్ల రాయితీ
Sakshi Education
రాబోయే ఖరీఫ్ సీజన్(ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 29వ తేదీ ఆమోదించింది.
అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనిసస్ వంటి కంపెనీలు కలిసి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. రక్షణ, అటోమొబైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు అవసరమైన సెమీ–కండక్టర్లను తయారు చేస్తారు.
Gaganyaan Mission: గగన్‌యాన్ వ్యోమగాములు వీళ్లే.. జాతికి పరిచయం చేసిన మోదీ
Published date : 01 Mar 2024 06:08PM