Skip to main content

Medical College Posts : వైద్య క‌ళాశాల‌ల్లో మంజూరై పోస్టులు సంఖ్య 90,794.. ఉద్యోగాల వివ‌రాలు ఇవే..! త్వ‌ర‌లోనే..

దేశంలో ఉన్న వైద్య క‌ళాశాల‌ల కోసం 90,794 పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
Total number of recruitments in all india medical colleges  Ministry of Health and Family Welfare announces 90,794 posts for medical colleges in India

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశంలో ఉన్న వైద్య క‌ళాశాల‌ల కోసం 90,794 పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో జ‌రిగిన స‌మావేశంలో ఈ వివ‌రాల‌ను తెలిపారు. దీంతో దేశంలో, రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఉన్న వైద్య క‌ళాశాల‌లకు నియ‌మించిన పోస్టులు..

KGBV Jobs : ఈ అర్హ‌త‌లతోనే కేజీబీలో ఖాళీగా ఉన్న‌పోస్టుల‌కు ఎంపిక‌.. వివ‌రాలు ఇలా..

వాటి వివ‌రాలను త‌మ‌కు తెల‌పాల‌ని మంత్రిత్వ శాఖ‌కు కోర‌గా.. వారు స్పందిస్తూ.. వైద్య కళాశాలలకు సంబంధించిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలు పొందుపరుస్తాయని, కేంద్రం మెయింటైన్ లేదని సంబంధిత మంత్రి వివ‌రించారు. మెడికల్ కాలేజీ రిక్రూట్‌మెంట్ నిబంధనలను రూపొందించడం, సవరించడం అనేది సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లు చేపట్టే కాలానుగుణ ప్రక్రియ అని కేంద్రం పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో క‌ళాశాల‌లో ఉన్న ఖాళీ పోస్టుల వివ‌రాల‌ను విడుద‌ల చేసింది మంత్రిత్వ శాఖ‌..

Bayraktar TB2 Drones: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ కిల్లర్‌ డ్రోన్లు

సర్. నం.
మెడికల్ కాలేజీ/ఇన్‌స్టిట్యూట్‌లు
మంజూరైన పోస్టుల సంఖ్య
1
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ
 
14,179
2
ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (PMSSY) కింద 22 కొత్త AIIMS
 
46,182
3
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగడ్ (PGIMER)
9,545
4
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి (జిప్‌మర్)
5,700
5
వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ (VMMC), న్యూఢిల్లీ (సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో అనుబంధం)
7,436
6
లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ (LHMC), న్యూఢిల్లీ
3,659
7
అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ABVIMS), న్యూఢిల్లీ (డా. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌తో అనుబంధం)
181
8
నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS), షిల్లాంగ్
1,979
9
రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS), ఇంఫాల్
1,933

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 11:02AM

Photo Stories