Skip to main content

TATA STEEL Jobs: 7 ల‌క్ష‌ల‌ ప్యాకేజీతో టాటా స్టీల్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

దేశంలో అత్యున్న‌త సంస్థ‌ల్లో ఒక‌టైన టాటా స్టీల్ ఉద్యోగ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల‌ను అర్హులైన అభ్య‌ర్థుల‌తో భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఎంపికైన విద్యార్థుల‌కు ఏడాదికి రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ల‌భిస్తుంది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి...
TATA STEEL
TATA STEEL

టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌-2023 కింద ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. 

☛➤☛ పదో తరగతి అర్హతతో 12,828 India Post Jobs... పూర్తి వివ‌రాలు ఇవే....

విభాగాలు: సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్‌, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.

tata steel

ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఎంటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 01.06.2023కు 30 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

జీతం: శిక్షణ సమయంలో స్టైపెండ్‌ నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

☛➤☛ ఇంట‌ర్ అర్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1600 ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే..

tata steel

ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇక్క‌డ‌ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు చివరి తేది: 11.06.2023

వివ‌రాల‌కు https://tslhr.tatasteel.co.in/recruit/Default.aspx వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు. 

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 30 May 2023 01:30PM
PDF

Photo Stories