Skip to main content

Air India VRS: ఎయిరిండియాలో మళ్లీ వీఆర్‌ఎస్‌

ఎయిరిండియా సంస్థ మరోసారి తమ నాన్‌–ఫ్లయింగ్‌ సిబ్బంది కోసం స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్‌ఎస్‌)ను ప్రకటించింది.
Air India VRS

కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. టాటాల ఆధీనంలోకి వచ్చాక ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అవకాశం ఇవ్వడం ఇది రెండోసారి. 40 ఏళ్లు, ఆపై వయస్సు వారు, సంస్థలో కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పర్మినెంట్‌ జనరల్‌ కేడర్‌ అధికారులకు ఇది వర్తిస్తుందని ఎయిరిండియా తెలిపింది. కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న క్లరికల్, నిపుణులు కాని కేటగిరీల ఉద్యోగులూ వీఆర్‌ఎస్‌కు అర్హులే. మొత్తం 11 వేల మంది ఉద్యోగుల్లో అర్హులైన 2,100 మంది ఏప్రిల్‌ 30వ తేదీలోగా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

Published date : 18 Mar 2023 01:26PM

Photo Stories