Skip to main content

India's Growth : భారత వృద్ధి 7 శాతంగానే.. కార‌ణం!

India's Economy Growth till Seven percent

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావొచ్చన్న అంచనాలతో వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) భారత వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచింది.

Shivaji's Weapon : భారత్‌కు చేరుకున్న ఛత్రపతి శివాజీ ‘వ్యాఘ్‌నఖ్‌’.. దీనితోనే!

జూన్‌ నెలలో ఆర్‌బీఐ భారత వృద్ధి రేటు అంచనాను 7 నుంచి 7.2 శాతానికి పెంచింది. 2024 ఏప్రిల్‌లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం, 2025–26 7.2 శాతం వృద్ది రేటును నమోదు చేసే అవకాశం ఉందని జూలై నెలలో విడుదల చేసిన అంచనాల్లో ఏడీబీ వెల్లడించింది. 

Published date : 23 Jul 2024 12:56PM

Photo Stories