Shivaji's Weapon : భారత్‌కు చేరుకున్న ఛత్రపతి శివాజీ ‘వ్యాఘ్‌నఖ్’.. దీనితోనే!
Sakshi Education
ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాఘ్‌నఖ్ (పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం) భారత్‌కు తిరిగి వచ్చేసింది. ఈ ఆయుధాన్ని లండన్ మ్యూజియం నుంచి జూలై 17న స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. ‘వాఘ్ నఖ్’ అనేది ఉక్కు ఆయుధం. 1659లో సతార యుద్ధంలో వ్యాఘ్‌నఖ్ అయుధంతోనే బీజాపూర్ సేనాపతి అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ మట్టుబెట్టారు. అయితే, దీనిని బుధవారం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుండి ముంబైకి తీసుకువచ్చారు.
Published date : 24 Jul 2024 10:04AM