Skip to main content

Mega Job Mela: జెడ్పీ పాఠ‌శాల‌లో మెగా జాబ్ మేళా

విలేక‌రుల స‌మావేశంలో జెడ్పీ పాఠ‌శాల‌లో నిర్వ‌హించే జాబ్ మేళా గురించి ఎమ్మెల్యే వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జాబ్ మేళాకు సంబంధించిన వివ‌రాల‌ను కూడా నిరుద్యోగ‌లకు తెలియ‌జేస్తూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.
MLA Shankar Rao announces about Mega job mela
MLA Shankar Rao announces about Mega job mela

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈనెల 28వ తేదీన క్రోసూరు జెడ్పీ పాఠశాలలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గురువారం కోరారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జాబ్‌మేళా గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా జరుగుతున్నట్లు తెలిపారు.

➤  Jagananna Civil Services Scheme: సివిల్ స‌ర్వీసెస్ ప్రోత్సాహ‌క ద‌ర‌ఖాస్తులు

పదవ తరగతి, ఇంటర్‌, బీటెక్‌, ఎంబీఏ చదువుకున్న నిరుద్యోగులు ఈ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందాలని కోరారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ నంబర్‌, పాస్‌పోర్టు, ఫొటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వివరాలకు రామకృష్ణారెడ్డి (8074393466), ఖాదర్‌బాషా (9440988148)లను సంప్రదించవచ్చునన్నారు.

Published date : 27 Oct 2023 04:13PM

Photo Stories