YSR Horticultural University: ఇక్కడ చదివిన వారికి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు
అమరావతి: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెం వద్ద 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 216 ఎకరాల్లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం. ఆ తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేయగా, గడిచిన ఐదేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ యూనివర్సిటీ అద్భుతమైన పురోగతి సాధించింది. ఏటా వందలాది విద్యార్థులను ఉద్యాన రంగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), జాతీయ వ్యవసాయ విద్య అక్రిడిటేషన్ బోర్డు ద్వారా ఏ గ్రేడ్ సంస్థగా గుర్తింపు పొందిన యూనివర్సిటీకి గడిచిన ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.100 కోట్లు మంజూరవుతున్నాయి.
Top 5 Companies To Work For In India: వీటిల్లో జాబ్ కొడితే ఉద్యోగులకు తిరుగుండదు..లింక్డిన్ సర్వే
ఈ నిధులతో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. పలు నూతన కోర్సులు, కళాశాలలు ఏర్పాటు చేశారు. సుశిక్షితులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో దేశ విదేశాల్లో కొలువులు సంపాదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో 43 మంది అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. మరో 33 మంది విదేశాల్లో ఉన్నత కొలువులు చేపట్టారు. మరో 2,650 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 300 మందికి పైగా ప్రైవేటు రంగంలోనూ ఉన్నత కొలువులు సాధించారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు భారతదేశం తొలి రోయింగ్ బెర్త్!
89 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
గత ఐదేళ్లలో యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్, రోజ్ గార్డెన్, ధన్వంతరీ పార్కు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి బీఎస్సీ హార్టీకల్చర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ టెక్నాలజీ రోబోటిక్స్‌ను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చారు. ఏపీ ప్రభుత్వ స్ఫూర్తితో స్మార్ట్ తరగతి గదులతో పాటు డ్రోన్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చారు.
యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో 89 నూతన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పులివెందుల ఉద్యాన కళాశాలలో 30 బోధన, 56 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేశారు. పీజీ విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.7 వేలకు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.7 వేల నుంచి రూ.10 వేలకు స్కాలర్‌షిప్‌లను పెంచారు. 38 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించారు.
Mana Ooru Mana Badi: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు శ్రీకారం.. మన ఊరు మన బడి పథకం అమలుతో..!
13,535 మందికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన
ఏటా 1,200 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఐసీఏఆర్ కోటా కింద వివిధ రాష్ట్రాల విద్యార్థులకు, విదేశీ విద్యా పథకాల ద్వారా పదికిపైగా దేశాల విద్యార్థులకు సైతం ఈ యూనివర్సిటీ వివిధ కోర్సుల్లో విద్యనందిస్తోంది. గడిచిన ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 13,535 మంది చదువుకున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.31 కోట్లు, వసతి దీవెన కింద రూ.6 కోట్లకు పైగా మొత్తం రూ.37 కోట్లకు పైగా లబ్ధి పొందారు. 5,707 మంది యూజీ, 803 మంది పీజీ/ పీహెచ్‌డీకి, 3,483 మంది డిప్లమో ప్రోగ్రామ్‌కు ప్రవేశాలు పొందగా, 3,744 మంది యూజీ, 750 మంది పీజీ, పీహెచ్‌డీ, 2,623 మంది డిప్లమో ప్రోగ్రామ్‌లను పూర్తి చేశారు.
శాస్త్రవేత్తనయ్యాను
కృష్ణా జిల్లా గిరిజన తండా అయిన వేదాద్రికి చెందిన నేను వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో పీహెచ్‌డీ చేశాను. అదే విశ్వవిద్యాలయంలో 2022లో ఉద్యాన శాస్త్రవేత్తగా నియమితుడినయ్యాను. ప్రస్తుతం, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా వివిధ ఉద్యాన ఉత్పత్తుల తయారీలో పరిశోధనలు చేస్తున్నా. మారుమూల తండాకు చెందిన నేను ఉద్యాన శాస్త్రవేత్త స్థాయికి ఎదిగేందుకు తోడ్పాటు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధ్యాపకులకు ధన్యవాదాలు.
– డాక్టర్ బానావత్ బాబూరావు, ఉద్యాన శాస్త్రవేత్త, వెంకటరామన్నగూడెం
Free Admissions Day: 23న యూకే, యూరప్ ఉచిత అడ్మిషన్స్ డే
విద్యాదీవెన ద్వారా చదువుకున్నా..
పార్వతీపురం ఉద్యాన కళాశాలలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉద్యాన డిగ్రీ పూర్తి చేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఉద్యాన శాఖాధికారిణిగా ఎంపికై, గతేడాది జూన్‌లో బాధ్యతలు చేపట్టాను. ఆర్బీకేల ద్వారా సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు సూచనలు అందిస్తున్నా. ఉద్యాన శాఖ ద్వారా అందిస్తోన్న రాయితీలు, సంక్షేమ ఫలాలను రైతులకు అందించడంలో తోడ్పడుతున్నాను.
– బలరాం మహంతి శరణ్యమాధురి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా
Tags
- ysr horticulture university
- foreign education
- job offers
- education for students
- AP Education Schemes
- education journey of students
- College of Horticulture
- vidhya deveena
- various courses
- Education News
- Sakshi Education News
- Abroad Jobs
- amaravathi news
- NationalAgriculturalEducationAccreditationBoard
- YSRUdyanaUniversity
- YSRajasekharaReddy
- tadepalligudem
- AGradeInstitution
- sakshieducation updates