Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు భారతదేశం తొలి రోయింగ్ బెర్త్!
Sakshi Education
పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్ క్రీడలకు రోయింగ్ క్రీడాంశంలో భారతదేశం తొలి బెర్త్‌ను సాధించింది.
దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఏప్రిల్ 21న జరిగిన వరల్డ్ ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారతీయ సైనికుడు బల్‌రాజ్ పన్వర్ అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు.
హరియాణాకు చెందిన 25 ఏళ్ల బల్‌రాజ్ పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల రేసులో 7 నిమిషాలు 01.27 సెకన్లలో గోల్‌రేఖను దాటి, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విజయంతో భారత రోయింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
Paris Olympics: చెఫ్ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్.. కారణం ఇదేనా..
Published date : 22 Apr 2024 04:35PM