Skip to main content

Paris Olympics: చెఫ్‌ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్‌.. కారణం ఇదేనా..

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఇండియా చెఫ్‌ డీ మిషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు.
Mary Kom stepped down as Chef de Mission  Indian boxer Mary Kom Mary Kom resigns as Indias Chef de Mission

ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాసింది. ‘దేశానికి సేవ చేయడాన్ని నేనెప్పుడు గౌరవంగా భావిస్తాను. మానసికంగానూ సిద్ధంగా ఉంటా. కానీ.. వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని 41 ఏళ్ల ఈ మణిపూర్‌ మహిళా బాక్సర్‌ లేఖలో వివరించింది. 

దీనిపై స్పందించిన పీటీ ఉష.. మేరీకోమ్‌ పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమే అయినా.. ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని తెలిపారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. 

Mirabai Chanu: వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌

Published date : 13 Apr 2024 05:44PM

Photo Stories