Skip to main content

Top 5 Companies To Work For In India: వీటిల్లో జాబ్‌ కొడితే ఉద్యోగులకు తిరుగుండదు..లింక్డిన్‌ సర్వే

Top 5 Companies To Work For In India  Linkedin Survey Job Security and Career Growth

ఈ కంపెనీల్లో జాబ్‌ కొడితే ఉద్యోగులకు తిరుగుండదని, వారి భవిష్యత్‌కు ఢోకా లేదంటూ ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ సర్వే తెలిపింది. 

తాజాగా, లింక్డిన్‌ ఈ ఏడాది భారత్‌లో పలు కంపెనీలు తమ ఉద్యోగుల కెరియర్‌ ఎంతమేరకు కృషి చేస్తున్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకుంది. వాటి ఆధారంగా ఓ సర్వే చేసి.. ఒక్కో కంకపెనీకి రేటింగ్‌ కూడా ఇచ్చింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రథమ స్థానంలో నిలిచింది.  

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) - టెక్నాలజీ కంపెనీ
లింక్డిన్‌ సర్వే చేసిన తొలి ఐదు కంపెనీల్లో ఎప్పటిలాగే టీసీఎస్‌ తొలిస్థానంలో నిలిచింది. ఉద్యోగుల గ్రోత్ విషయంలో టీసీఎస్‌ ఎక్కువ మార్కులే కొట్టేసింది. దీంతో తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయంగా ఉన్న కంపెనీల్లో ఒక్క టీసీఎస్‌ మాత్రమే  2024 గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌ను కండక్ట్‌ చేయనుంది. 

యాక్సెంచర్ - టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలు
యాక్సెంచర్ అనుబంధ సంస్థ యాక్సెంచర్ ఇండియా స్ట్రాటజీ, కన్సల్టింగ్, డిజిటల్, టెక్నాలజీ ఇతర కార్యకలాపాల్లో సేవలందిస్తుంది. 1987లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన యాక్సెంచర్‌ ఇప్పుడు దేశంలో అతిపెద్ద టెక్నాలజీ,  కన్సల్టింగ్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఉద్యోగుల వృత్తిరిత్యా తోడ్పాటు అందించడంలో రెండో స్థానంలో నిలిచింది. 

కాగ్నిజెంట్ - టెక్నాలజీ, కన్సల్టింగ్‌ సేవలు
యాక్సెంచర్‌ తర్వాత కాగ్నిజెంట్ తర్వాతి స్థానంలో నిలిచింది. 1994లో స్థాపించిన ఈ సంస్థ ఐటీ ఆధారిత సేవలు, కన్సలింగ్‌ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇటీవల భువనేశ్వర్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. 5వేలమందిని నియమించుకుంనేందుకు సిద్ధంగా ఉంది. ఉద్యోగుల విషయంలో మంచి మార్కులే కొట్టేసింది   

మక్వారీ గ్రూప్ 
మక్వారీ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్‌లో సేవలందిస్తుంది. భారత్‌లోని టాప్ 5 కంపెనీల్లో వరుసగా రెండో ఏడాది కూడా కంపెనీ చోటు దక్కించుకుంది. ఉద్యోగుల కెరియర్ పురోగతికి కృషి చేయడంలో 4వ స్థానంలో నిలిచింది.  

మోర్గాన్ స్టాన్లీ
ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఆర్ధికపరమైన సేవల్ని అందిస్తోంది. ఉద్యోగుల విషయంలో ఐదో స్థానంలో నిలిచిందని లింక్డిన్‌ సర్వే తెలిపింది. 

Published date : 22 Apr 2024 05:29PM

Photo Stories