Jagananna Civil Services Scheme: సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక దరఖాస్తులు
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభ్యర్థుల కోసం ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ తెలిపారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారి కోసం నగదు ప్రోత్సాహకంగా ఆర్థిక సహా యం అందిస్తారని పేర్కొన్నారు.
☛ FLN Program for School Education: పాఠశాలల్లో విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంచే కార్యక్రమం..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి రూ.లక్ష , మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.50 వేల ప్రోత్సాహకం అందిస్తారని, ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు jnanabhumi.ap.gov.in పోర్టల్‌లో అందించిన వెబ్‌లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చేనెల 4లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.