Gurukul Teachers : సమ్మేబాట పట్టిన గురుకుల గురువులు..
మదనపల్లె సిటీ: ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ పెద్దలను వేడుకున్నా వారు కనికరించలేదు. దీంతో గురుకులాల గురువులు సమ్మె బాట పట్టారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో శాంక్షన్ పోస్టులు లేకపోవడంతో 90 శాతానికి పైగా అవుట్ సోర్సింగ్ టీచర్లు బోధిస్తున్నారు. వీరంతా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 27వ తేదీ నుంచి ఉద్యమబాట పట్టారు.
SSC CGL Tier 1 Results Released: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, చాలీచాలనీ వేతనాలతో జీవితాలను సాగిస్తున్న తమను కాంట్రాక్టు రెగ్యులర్ టీచర్స్ (సీఆర్‌టీ)లుగా పరిగణించాలని వారు సమ్మె చేస్తున్నారు. సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అటకెక్కిన బోధన
గిరిజన గురుకులాల్లో టీచర్లు లేకపోవడంతో విద్యాబోధన అటకెక్కింది. జిల్లాలోని ఏడు గిరిజన గురుకులాల్లో 3 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 1270 మంది విద్యార్థులున్నారు. ఆయా పాఠశాలల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన టీచర్లు సమ్మెలో ఉన్నారు.మరో మూడు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఐఎఫ్‌సీ ద్వారా కొనసాగుతున్న బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సదుద్దేశంతో నాడు–నేడు కింద వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి స్కూల్‌కు రూ.లక్ష వెచ్చించి ఐఎఫ్‌ఎల్ (ఇంటరాక్టివ్ ప్లాట్ పానెల్స్) సిస్టమ్స్‌ను సమకూర్చారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్, ఒకరిద్దరు రెగ్యులర్ టీచర్లు బోధన కొనసాగిస్తున్నారు.
మండలం; విద్యార్థులు; సమ్మెలో ఉన్న టీజీలు
మదనపల్లె; 130; 8
తంబళ్లపల్లె; 80; 6
పీలేరు; 100; 8
కె.వి.పల్లి; 200; 11
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
రాయచోటి; 230; 6
రాయచోటి; 400; 21
సుండుపల్లె; 130; 8
మదనపల్లె గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 130 మంది విద్యార్థులు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ) ఉన్నారు. ఈ పాఠశాలలో ఎనిమిది మంది టీజీటీ లు అవుట్‌సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఉద్యమబాట పట్టారు. ప్రస్తుతం గురుకులంలో చదువు చెప్పేవారు లేక బోధన కుంటుపడింది.
Intermediate Exams : ఈ తేదీల్లోనే ఇంటర్ పరీక్షలు ఉంటాయా..? విద్యార్థులకు అధికారుల సూచన ఇదే..
తంబళ్లపల్లె గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో ఆరు మంది టీజీటీలు అవుట్ సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వహిస్తురు. వీరు ఉద్యమబాట పట్టారు. ప్రస్తుతం గురుకులంలో ప్రిన్సిపాల్ ఒక్కరే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు.