Post Office Jobs: రాత పరీక్ష లేకుండానే..పదో తరగతి ఉత్తీర్ణతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్)పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ పోస్టాఫీస్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. గతేడాది జనవరిలో దాదాపు 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
నాలుగు గంటలే పని గంటలు..
ఎంపికైనవారిని బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (ఏబీపీఎం),సహా వివిధ హోదాల్లో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల వరకు వేతనం లభిస్తుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకోవచ్చు.