Skip to main content

Job Mela: 23న దివ్యాంగుల ఉద్యోగమేళా

రాయచోటి టౌన్‌: దివ్యాంగుల ఉద్యోగుల మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్యజిల్లా ఉపాధికల్పనాధికారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Annamayya district employment officer    Disabled job fair announcement   job mela for disabled people on 23rd   Annamayya district skill development organization

అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు పీలేరులోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో యాక్ట్‌ బైబర్‌ కస్టమర్‌ సంపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌, కంపాస్‌ గ్రూప్‌ కంపినీలో స్టేవార్డ్స్‌ ఉద్యోగాలు, మాక్స్‌ రిటైల్‌ కంపినీలో పోల్డింగ్‌ అసిస్టెంట్స్‌, మెక్‌ డొనాల్డ్‌ కంపినీలో క్రెవ్‌ మెంబర్‌ స్టోర్‌ ఉద్యోగాల కోసం, బీపీసీఎల్‌ కంపినీలో డీఎస్‌ఎం/ డీఎస్‌డబ్ల్యూ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదోతరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు చదువుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఎంపికై న అభ్యర్థులకు వేతనం రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలు, ఫొటోలతో మహిళలు / పురుష అభ్యర్థులు నేరుగా హాజరు కావచ్చని తెలిపారు.

అత్యుత్తమ ప్రమాణాలతో భవనాల నిర్మాణం
ఓబులవారిపల్లె: తల్లెంవారిపల్లె జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాల నూతన భవనాలు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణం చేశారని ఆర్‌జేడీ ఎద్దుల రాఘవరెడ్డి అన్నారు. బుధవారం గాదెల పంచాయతీ తల్లెంవారిపల్లె గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనాలను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ తక్కువ సమయంలో నాణ్యతతో కూడిన పనులు చేయడం హర్షణీయమని అన్నారు.త్వరలోనే వీటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం తరగతి గదుల్లో ఏర్పటు చేసిన ఎల్‌ఈడీ టీవీల ద్వారా బైజూస్‌ క్లాస్‌లను పరిశిలించారు. హెచ్‌ఎం షాయిదుల్లాతో మాట్లాడారు. పాఠశాల గురించి విషయాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గడ్డం ఆదినారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రవికూమార్‌, నరసీంహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Job Mela: టీవీఎస్‌ ట్రైనింగ్‌, సర్వీసెస్‌ కంపెనీలో రేపు జాబ్‌మేళా

వ్యాయామ విద్యతో జీవన ప్రమాణాలు మెరుగు
రాయచోటి టౌన్‌: వ్యాయామ విద్యతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డీఈవో శివప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలోని బాలికోన్నత పాఠశాలలో రాయచోటి నియోజక వర్గ పరిధిలోని వ్యాయమ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాయామంతో మానసిక, శారీరక ధారుఢ్యం లభిస్తుందని చెప్పారు. క్రమం తప్పకుండా పీడీలు, పీఈటీలు డ్రస్‌ కోడ్‌ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పీఈటీల నియోజకవర్గ బాధ్యులు జగదీశ్వరయ్య, ఏపీ పీఈటీ, ఎస్‌ఏ పీఈ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ జాయింట్‌ సెక్రటరీ రెడ్డెయ్య, పీడీలు లలితమ్మ, లక్ష్మినారాయణ, వెంకటరాజు, నిర్మలమ్మ, పద్మజ, అమరనాథరెడ్డి, వరద రాజు, చక్రపాణి, గంగరాజు, ఫయాజ్‌, కొండలరావు, అంజి, వాణి పాల్గొన్నారు.

ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ
వైవీయూ: అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో నిర్వహిస్తున్న ఖేలోఇండియా విశ్వవిద్యాలయ క్రీడాపోటీల్లో వైవీయూ క్రీడాకారిణి లీసా కంసా సత్తా చాటింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాంశంలో 59 కేజీల మహిళల విభాగంలో పోటీపడిన ఈమె స్నాచ్‌ విభాగంలో 77 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలో 104 కేజీల బరువెత్తి రెండోస్థానంలో నిలిచింది. రజత పతకం కై వసం చేసుకుంది. కమలాపురానికి చెందిన సీఎస్‌ఎస్‌ఆర్‌ అండ్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ కళాశాలకు చెందిన లీసా కంసా ఈ విద్యాసంవత్సరంలో జాతీయస్థాయిలో 5 పతకాలు సాధించడం విశేషం. క్రీడాకారిణికి వైవీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి అభినందనలు తెలిపారు.

చదవండి: AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

Published date : 22 Feb 2024 04:37PM

Photo Stories