UGC NET 2024 Notification: యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ విడుదల.. నాలుగేళ్ల డిగ్రీతో దరఖాస్తు చేసుకోనే అవకాశం..!
సాక్షి ఎడ్యుకేషన్: యూజీసీ నెట్.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్–నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్! జేఆర్‌ఎఫ్‌తో పీహెచ్‌డీలో చేరేందుకు.. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష! అందుకే.. బోధన, పరిశోధన విభాగాల్లో కెరీర్ కోరుకునే అభ్యర్థులు ఎక్కువగా యూజీసీ–నెట్‌కు ప్రిపరేషన్ సాగిస్తుంటారు. తాజాగా యూజీసీ.. నెట్‌లో కీలక మార్పులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్–2024 జూన్‌లో కొత్త మార్పులు, ఈ పరీక్షతో ప్రయోజనాలు, అర్హతలు, బెస్ట్ స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం..
ఇంతకాలం పీహెచ్‌డీలో చేరాలంటే.. పీజీ పూర్తి చేసి.. నెట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ తాజా నిర్ణయంతో నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెట్ స్కోర్ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. యూజీసీ–నెట్‌ను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది.. తొలి విడత పరీక్ష జూన్–2024కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అర్హత ప్రమాణాలు, నెట్ నిర్వహించే కేటగిరీలలో మార్పులు ప్రకటించారు.
Ayushman Bharat Diwas 2024: ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్
విద్యార్హతలు
- కనీసం 55% మార్కులతో పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి. కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీహెచ్‌డీలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం మినహాయింపు కల్పిస్తారు.
- అర్హత కోర్సు చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల అభ్యర్థులకు సర్టిఫికెట్లు పొందాకే.. వీటికి అర్హత లభిస్తుంది. పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారు నెట్ ఫలితాలు విడుదలైన సంవత్సరంలోపు నిర్దేశిత శాతంతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
PECET 2024 Notification: వ్యాయామ విద్యలో ప్రవేశానికి పరీక్షల నోటిఫికేషన్ విడుదల..!
వయసు
- జేఆర్‌ఎఫ్ అభ్యర్థుల వయసు జూన్ 1, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీ–ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీలో ప్రవేశం కోరే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
- నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ
- యూజీసీ–నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ ప్రకారం–నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అర్హత సాధించి యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందొచ్చు. యూనివర్సిటీలు నాలుగేళ్ల డిగ్రీతోనూ పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించాలని యూజీసీ ఇప్పటికే మార్గనిర్దేశకాలు జారీ చేసింది. దీనికోసం నెట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. పీహెచ్‌డీలో ప్రవేశం పొందాలనుకునే నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు కనీస 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించింది.
మూడు కేటగిరీలుగా పరీక్ష
- ఇప్పటి వరకు రెండు కేటగిరీల్లోనే (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్) నెట్‌ను నిర్వహించారు. రీసెర్చ్/జేఆర్‌ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగానికి.. అధ్యాపక వృత్తికి మాత్రమే పరిమితం అవుదామనుకునే వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకునే వారు. దీనికి భిన్నంగా ఇకపై మూడు కేటగిరీలుగా నెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అవి..
- కేటగిరీ–1: జేఆర్‌ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం.
- కేటగిరీ–2: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్‌డీలో ప్రవేశం.
- కేటగిరీ–3: పీహెచ్‌డీలో ప్రవేశానికి మాత్రమే.
Chess Champions: భారతదేశానికి చెందిన చెస్ చిచ్చరపిడుగులు వీరే..
పరీక్ష స్వరూపం
- యూజీసీ నెట్ పరీక్ష స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్–2: సబ్జెక్ట్ పేపర్: అభ్యర్థుల డొమైన్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్–1(టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్) మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది.
కనీస అర్హత మార్కులు
యూజీసీ నెట్ పరీక్షలో మూడు కేటగిరీల అభ్యర్థులు (జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీ) ఉత్తీర్ణత సాధించాలంటే.. తాము రాసిన పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు పొందాలి. ఈ సడలింపు (35 శాతం మార్కులు)ను జనరల్– ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 10
- ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణ అవకాశం: 2024, మే 13–15
- యూజీసీ–నెట్ పరీక్ష తేదీ: 2024, జూన్ 18
- వివరాలకు వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in
ఉమ్మడి పేపర్‌కు సన్నద్ధత
మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడి పేపర్‌గా నిర్దేశించిన పేపర్–1లో.. టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల (టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
సబ్జెక్ట్ పేపర్‌కు ఇలా
పేపర్–2లో ప్రశ్నలు అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్ లేదా డొమైన్ సబ్జెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఇందులో రాణించేందుకు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ప్రశ్నలు ఏ విధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
HAL Recruitment: హెచ్‌ఏఎల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు..
నెట్‌తో ప్రయోజనాలెన్నో!
- యూజీసీ నెట్‌లో ప్రతిభ చూపి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం–నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం–అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు బేసిక్ పే రూ.67 వేలు చెల్లించే విధంగా యూజీసీ నిర్ణయించింది.
- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు (జేఆర్‌ఎఫ్) ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్ అందుతుంది. జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల ఫెలోషిప్ పొందొచ్చు. జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. సైంటిస్ట్‌లుగా ఎంపికైన వారికి.. వారి గ్రేడ్ ఆధారంగా ప్రారంభంలోనే నెలకు రూ.ఎనభై వేల వేతనం పొందే అవకాశాలున్నాయి.
28 Posts at TMC Mumbai: ముంబాయి టీఎంసీలో 28 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!
- ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
- నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత లభిస్తుంది.
- ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.
Good News For Anganwadi Teachers : అంగన్వాడీలకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై వీరికి..
Tags
- UGC NET 2024
- notification
- four year degree
- Ph.D
- online applications
- deadline for registrations
- Entrance Exam
- Age limit
- Higher education opportunities
- National Testing Agency
- ph.D admission process
- Education News
- NET in three categories
- Advantages with NET
- Professor posts
- UGCdecision
- UGCNET2024
- EligibilityCriteria
- sakshieducation latest updates