Skip to main content

PECET 2024 Notification: వ్యాయామ విద్యలో ప్రవేశానికి పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలు..
TS Physical Education Common Entrance Test notification 2024

సాక్షి ఎడ్యుకేషన్‌: వ్యాయామ విద్యలో ప్రవేశాలు కోరుకునే వారి కోసం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్‌)–2024 ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ/ప్రైవేట్‌/అనుబంధ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

»    పరీక్ష: తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌–2024).
»    ప్రవేశం కల్పించే కోర్సులు: బీపీఈడీ(రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు).

 అర్హతలు

»   బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01.07.2024 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. 
»   డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు 01.07.2024 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి.

AP DEESET 2024: ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

క్రీడల పోటీలు
ఇందులోనూ రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్‌ ద షాట్, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/హైజంప్‌; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్, 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌/హైజంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్‌ ఉంటుంది. బాల్‌ బ్యాడ్మింటన్‌ బాస్కెట్‌ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకి, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌ టెన్నిస్, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి.

3000 Jobs: ‘పోలీస్‌ బోర్డు’ ద్వారా.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక

ముఖ్యసమాచారం

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
»    ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 15, 2024
»    మే 26 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
»    జూన్‌ 10 నుంచి 13 వరకు స్పోర్ట్స్‌ టెస్టులు 
(కరీంనగర్‌)లో నిర్వహిస్తారు.
»    వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in

Published date : 01 May 2024 01:26PM

Photo Stories