Skip to main content

AP DEESET 2024: ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ డీఈఈసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రెండేళ్ల కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి..
Notification for AP DEEPSET 2024 two years Diploma course

సాక్షి ఎడ్యుకేషన్‌: ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ డీఈఈసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(డీఈఈసెట్‌)–2024 పరీక్ష నిర్వహించనుంది. డీఈఈసెట్‌ ర్యాంక్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

Prof Laxminarayana: ఓయూ హాస్టళ్లు కొనసాగుతాయి: రిజిస్ట్రార్‌

»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.09.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
»    ఎంపిక విధానం: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌–ఎ 60 మార్కులు(60 ప్రశ్నలు), పార్ట్‌–బి 40 మార్కులు(40 ప్రశ్నలు) ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
»    క్వాలిఫైయింగ్‌ మార్కులు: ఓసీ, బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 మార్కులు.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.04.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.05.2024.
»    హాల్‌టిక్కెట్ల వెల్లడి తేది: 21.05.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 24.05.2024.
»    వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in

PG Entrance Exam: పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశాలకు ఎన్‌ఐఎన్‌ పరీక్ష

Published date : 01 May 2024 12:52PM

Photo Stories