Skip to main content

28 Posts at TMC Mumbai: ముంబాయి టీఎంసీలో 28 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!

టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉన్న పోస్టులకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతుంది సంస్థ. అయితే, ఆ పోస్టులకు కావాల్సిన అర్హతలు, విద్యానుభవాలను గురించి పూర్తి వివరాలను తెలిపారు..
Online applications and eligibles for 28 posts in TMC Mumbai

ముంబాయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 28 పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

»    మొత్తం పోస్టుల సంఖ్య: 28
»    విభాగాల వారీగా పోస్టుల వివరాలు: మెడికల్‌ ఫిజియోనిస్ట్‌–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–03, స్టెనోగ్రాఫర్‌–01, ఫిమేల్‌ నర్స్‌–22, టెక్నీషియన్‌(సి)–01.

మెడికల్‌ ఫిజినిస్ట్‌–1
ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌), రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ డిప్లొమా పూర్తిచేయాలి. లేదా ఏఈఆర్‌బీ ఆమోదించిన విద్యార్హతలు, రేడియోలాజికల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించకూడదు. మెడికల్‌ ఫిజినిస్ట్‌గా ఏడాది క్లినికల్‌ అనుభవం తప్పనిసరి. సీ++, మ్యాట్‌లాబ్, పైతాన్‌ తదితర కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి­కి రూ.56,100, ఇతర ప్రోత్సాహకాలు లభిస్తాయి.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–3
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 27 ఏళ్ల మించకూడదు.

స్టెనోగ్రాఫర్‌–1
డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. షార్ట్‌హ్యాండ్‌ వేగం నిమిషానికి 80 పదాలు, టైపింగ్‌ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌లో కనీసం మూడు నెలల కోర్సు పూర్తిచేసినవారై ఉండాలి. లేదా కంప్యూటర్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా/డిగ్రీ ఉండాలి. గరిష్ట వయసు 27 ఏళ్ల మించకూడదు.

HAL Recruitment: హెచ్‌ఏఎల్ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు..

ఫిమేల్‌ నర్స్‌–22
జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ, డిప్లొమా ఇన్‌ ఆంకాలజీ లేదా బేసిక్‌/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ(నర్సింగ్‌) పూర్తిచేయాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. అలాగే ఇండియన్‌/స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదవ్వాలి. టీఎంసీలో నర్సింగ్‌ ఆంకాలజీ డిప్లొమా చేసి, బాండ్‌ పీరియడ్‌ కాలానికి పనిచేసినవారికి గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 50 పడకల ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం రూ.44,900+ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

టెక్నీషియన్‌ సి–1
సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఐసీయూ/ఓటీ/ ఎలక్ట్రానిక్స్‌/డయాలిసిస్‌ టెక్నీషియన్‌ ఏడాది/ఆరునెలలు డిప్లొమా పూర్తిచేయాలి. గరిష్ట వయసు 30 ఏళ్లకు మించకూడదు. అలాగే సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. వేతనం రూ.25,500+ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.
గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, టీఎంసీ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. ఇంటర్వ్యూకు/రాత పరీక్ష /స్కిల్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఇంటర్వ్యూ సమయంలో ఒరిజనల్‌ ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

Good News : వీరికి ఉచితంగా 2 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఎలా అంటే..?

పనిచేయాల్సిన ప్రాంతాలు
ఉద్యోగాలకు ఎంపికైన వారిని ముంబయి, వారణాసి, వైజగ్, గువాహటీల్లో ఉన్న టాటా మెమోరియల్‌ హాస్పిటల్, హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటళ్లలో ఎక్కడైనా నియమిస్తారు.

వేతనంతోపాటు ప్రోత్సాహకాలు
ఎంపికైన వారికి వేతనంతో పాటుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ లాంటి ప్రోత్సాహకాలు, వైద్య, వసతి, పదవీ విరమణ తర్వాత జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ సమావేశాలు, ట్రైనింగ్, మీటింగ్స్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07.05.2024
»    వెబ్‌సైట్‌: https://tmc.gov.in

Coromandel: ఏపీలో కోరమాండల్‌ ప్లాంటు నిర్మాణం ప్రారంభం.. ఎక్క‌డంటే..

Published date : 01 May 2024 12:06PM

Photo Stories